HomeTelanganaNizamabadకుళాయి బిల్లుల కోసం ప్రజలను వేదించవద్దు....కమిషనర్ ను కోరిన గడుగు

కుళాయి బిల్లుల కోసం ప్రజలను వేదించవద్దు….కమిషనర్ ను కోరిన గడుగు

కుళాయి బిల్లుల పేరుతొ పేద ప్రజలను వేధిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దని కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బిల్లులు వసూలు చేసే క్రమంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలతో కలిసి మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేశారు

ఈ సందర్భంగా కార్పొరేటర్ గడుగు రోహిత్ గారు మాట్లాడుతూ నల్ల కలెక్షన్లు చేసేటువంటి బిల్ కలెక్టర్లు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే నల్లా కనెక్షన్ తొలగిస్తామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన అధికారులు ఎవరైనా వచ్చి నల్ల బిల్లుల కోసం ఇబ్బందులకు గురి చేస్తేతాము అడ్డుకుంటామన్నారు బాధిత ప్రజలు స్థానికకాంగ్రెస్ నాయకులను సంప్రదించాలన్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన మేయర్ కావాలని కక్షపూరితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా అధికారులను పురమాయించి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని .

కాంగ్రెస్ పార్టీని ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే సహించేది లేదని ఈ బిల్లుల కలెక్షన్లు తమరి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని ఆయన మేయర్ ని ప్రశ్నించారు 9 సంవత్సరాలు కాలక్షేపం చేసి ఇప్పుడు హడావిడిగా బిల్లుల కలెక్షన్ చేస్తూ

సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారనిఆయన మండిపడ్డారు నవాజ్, మోయిన్, సయ్యద్ అర్షాద్, సేవ దళ్ , షేక్ జాకిర్, NSUI జిల్లా అధ్యక్షులు వరద బట్టు వేణురాజ్. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments