మోర్తాడ్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో గల మొండి వాగు ప్రాజెక్ట్ వంతెన సమీపంలో చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.
స్మశాన వాటిక సమీపంలో నుండి మొండి వాగులోకి కామారెడ్డి నుండి బ్రతుకు దేరువు కోసంవచ్చిన ఇద్దరు వ్యక్తులు చేపలు పట్టడానికి వెళ్లారు.
చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తుల్లో సురేష్ అనే వ్యక్తి కాలు జారి వాగులో పడి నీటి ప్రహానికి కొట్టుకుపోయాడు. మరో వ్యక్తి గల్లంతైన వ్యక్తి కోసం కేకలు వేయడంతో గమనించిన స్థానికులు గల్లంతైన వ్యక్తి కోసం వెతుకుతున్నారు.
గల్లంతైన వ్యక్తి ఆచుకి కోసం మోర్తాడ్ పోలీసులు సంఘటన స్థలంలో గాలిస్తున్నట్లు సమాచారం.
