Tuesday, April 21, 2026
HomeLaw and Orderవినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి…పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనెవార్…

వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి…పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనెవార్…

వినాయక చవితి ఉత్సవాలు సామరస్యం, సమన్వయంతో శాంతియుతంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రజలతో కలసి శాంతియుత సమావేశాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు.

ఈనెల 7 నిర్వహించే గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా చూడాలని కోరారు.అదే విధంగా వినాయకుని తీసుకువచ్చే సమయంలో ఎవరు డీజీలు పెట్టరాదు.అట్టి వెహికల్స్ లో చిన్న పిల్లలను ఉండకుండా చూసుకోవాలి.6 ఫీట్ల కంటే ఎత్తు గల వినాయకుల ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి.వినాయకులు తెచ్చే క్రమంలో కరెంట్ వైర్లు తాగకుండా చూసుకోవాలి.

వినాయకులను దించే క్రమంలో జాగ్రత్త వహించాలి.పూజా కార్యక్రమంలో ఆడవాళ్ళతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. వినాయక మండపంలో తొమ్మిది రోజులు రెండు బాక్సులు మాత్రమే పెట్టుకోవాలనీ తెలిపారు. అదే విధంగా నిమర్జనం చేసేటప్పుడు ఎవరు మద్యం సేవించకుండా భక్తితో నిమజ్జనం చేయాలనీ హెచ్చరించారు.

వినాయక నిమజ్యానికి పెట్టుకున్న ట్రాక్టర్ మరియు లారీ డ్రైవర్లు ఎప్పుడు బండి వెంటనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో బండిని విడిచి ఎక్కడికి వెళ్ళరాదనీ హెచ్చరించారు.

అలాగే గణేష్ మండపాల నిర్వహకులు తమ వివరాలను తప్పనిసరిగా పోలీసులకు తెలియపరచాలని ఇందుకోసం ముందుగా నిర్వహకులు తాము ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం.

నిమజ్జనం తేదీ, ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న వెబ్సైట్https://policeportal.tspolice.gov.in ద్వారా లాగిన్ అయి మండపాల నిర్వహకులు పూర్తి వివరాలను నమోదుచేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్ లైన్ ద్వారా అనుమతులు జారీచేస్తారని తెలిపారు.

ముఖ్యంగా అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం,పాటలు పాడటంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!