నిజామాబాద్ నగరంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో మాణిక్ భండార్ చౌరస్తా రోడ్డుపై భారీ వరద నీరు చేరింది.
రోడ్డుపై నీటి ప్రవాహం భారీగా ఉన్నందున వాహనాదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాప్ లలో కి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అక్కడే ఉన్న మున్సిపల్ కార్మికులు రోడ్లపై వెళ్తున్న వాహనదారులకు, పాదాచారులకు ఆటంకం కాకుండా చర్యలు చేపట్టారు.
