ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందారు. భీమ్‌గల్ మండలంలోని లింబాద్రి గుట్ట సమీపంలో శుక్రవారం చోటుచేసుకున్న విషాదకర ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..మండల కేంద్రానికి చెందిన ముగ్గురు చిన్నారులు అరవింద్ (14), హరీష్ (10), వర్షిణి (5) శుక్రవారం మధ్యాహ్నం లింబాద్రి గుట్ట సమీపంలోని నీటి కుంట వద్దకు వెళ్లారు. అయితే, నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తూ వారు నీట మునిగిపోయారు.
గమనించిన స్థానికులు వెంటనే వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు ఇలా మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
