నాగర్ కర్నూల్ జిల్లా మామిళ్ళపల్లి వద్ద పిడుగుపాటుకు గురై ఓ కానిస్టేబుల్ మృత్యువాత పడ్డారు. సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఉల్పారా గ్రామానికి చెందిన మద్దమల్ల రాజు 2014 బ్యాచ్ ఏ ఆర్ కానిస్టేబుల్ గా ఎంపికై నాగర్ కర్నూల్ ఆర్మూడ్ రిజర్వులో విధులు నిర్వర్తిస్తున్నాడు.
గత రెండు రోజులుగా సీఎం బందోబస్తు నిమిత్తం సోమశిల లో విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా మామిళ్ళపల్లి గ్రామం సమీపంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించడం జరిగింది.
సమాచారం అందుకున్న ఉప్పునుంతల పోలీసులు మృతదేహాన్ని నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రగడ సంతాపాన్ని ప్రకటించిన ఎస్పీ ఏ ఆర్ కానిస్టేబుల్ రాజు మూర్తి పట్ల నాగర్ కర్నూల్ ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మృతుడి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
