Tuesday, April 21, 2026
HomeCRIMEమద్యం సేవించి వ్యక్తి మృతి…

మద్యం సేవించి వ్యక్తి మృతి…

మద్యం సేవించి వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని మూడవ టౌన్ పరిధిలో బుదవారం చోటుచేసుకుంది.ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం… మాణిక్ భండార్ గ్రామానికి చెందిన జంగం ప్రభాకర్(42).

మంగళవారం రాత్రి దుబ్బ లోని ఏంవిఆర్ వైన్స్ పక్కన ఉన్న పర్మిట్ రూమ్ లో మద్యం సేవించినట్లు తెలిపారు.మద్యం సేవించి వాంతులు చేసుకోవడంతో ఒక్కసారిగా ఊపిరాడక మృతి చెందినట్లు తెలిపారు.అక్కడే ఉన్న వాచ్ మెన్ గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!