బంగాళాఖాతం లోఏర్పడిన వాయుగుండప్రభావం తో మొదలైన వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. మంగళవారం రోజంతా మబ్బులున్న వర్షం లేకుండే కానీ అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటలు దంచి కొట్టింది.
దీనితో నగరంలో అనేక కాలనీలో ఇండ్లలోకి వర్షం నీరు చేరింది.దీనితో రోడ్ల మీదికి వచ్చారు. ప్రధాన వీధులు జలమయం అయ్యాయి. రైల్వే అండర్ బిడ్జి కింద వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
మాణిక్ భండార్ చౌరస్తా రోడ్డుపై భారీ వరద నీరు చేరింది. రోడ్డుపై నీటి ప్రవాహం భారీగా ఉన్నందున వాహనాదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాప్ లలో కి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అక్కడే ఉన్న మున్సిపల్ కార్మికులు రోడ్లపై వెళ్తున్న వాహనదారులకు, పాదాచారులకు ఆటంకం కాకుండా చర్యలు చేపట్టారు.
