మావోయిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి (దేవ్ జీ) ని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత శుక్రవారం పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.
విషయం తెలుసుకున్న కవిత హాస్పిటల్ కు వెళ్లి దేవ్ జీ ని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని, సాధారణ జీవితంలోకి అడుగుపెట్టాలని ఈ సందర్భంగా కవిత ఆకాంక్షించారు.
దేవ్ జీ కి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు.
