రంగారెడ్డి జిల్లా కోహెడలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి దేవేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. హన్మకొండకు చెందిన దేవేందర్ రెడ్డి (16) నాలుగు రోజుల క్రితమే తన నివాసం నుంచి కళాశాల హాస్టల్‌కు వచ్చినట్లు సమాచారం.
కళాశాల హాస్టల్లో గురువారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో తనకు కేటాయించిన గది కాకుండా మరో గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని దేవేందర్ ఆత్మహత్య చేసుకున్నట్లు హాస్టల్ నిర్వాహుకులు హయత్ నగర్ పోలీసులకు చేసిన పిర్యాదు లో పేర్కొన్నారు .
చదువులో చురుకుగా ఉండే తమ కుమారుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు…
