రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్యాంకర్‌ను కారు వెనుక నుంచి వేగంగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన డిచ్‌పల్లి నాగ్‌పూర్ గేట్ సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న హ్యుందాయ్ వెన్యూ కారు (TG 18 A 6033) నాగ్‌పూర్ గేట్ దాటిన తర్వాత రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రుడిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.ప్రమాదం అనంతరం ట్యాంకర్ డ్రైవర్ వాహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ట్యాంకర్ ఆచూకీ కోసం ఎస్సై ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. మృతుడు, క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉంది.
