ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దర్పల్లి మండలంలో చోటుచేసుకుంది.స్థానికుల వివరాల ప్రకారం.. మండలానికి చెందిన విజయ్ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.
అయితే ఆమె రెండు రోజుల క్రితం మరో వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు తెలిసింది.ఈ విషయం తెలుసుకున్న విజయ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన బాధను వ్యక్తం చేస్తూ ఓ వీడియోను రూపొందించి, కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతూ భావోద్వేగానికి గురైనట్లు సమాచారం.
అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
