ఖమ్మం జిల్లా రఘునాథ్ పాలెం బీసీ గురుకులం పాఠశాలలో ఆడుకుంటున్న ఎనిమిదో తరగతి విద్యార్థి గుండె పోటు తో మృతి చెందాడు.మహాత్మా జ్యోతి పూలే గురుకులం పాఠశాలో 8 క్లాస్ చదువుతున్న సాత్విక్ రోజులాగే బుధవారం తెల్లవారు జామున నిద్రలేచి గ్రౌండ్ లో ఆడుకుంటున్నాడు
ఒక్కసారి కుప్పకూలి పోవడం తో తోటి విద్యార్థులు సిబ్బంది హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే సాత్విక్ మృతి చెందాడు గుండె పోటు వల్లే మృతి చెంది నట్లుగా గుర్తించారు
