నగరంలోని 50 క్వార్టర్స్ నాగారం ప్రాంతానికి చెందిన ఓ మహిళ అదృశ్యమైనట్లు ఐదో టౌన్ ఎస్‌ఐ సునీల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎనుగంటి సౌమ్య (26)కు రాజుతో వివాహమైంది.
ప్రస్తుతం భర్తతో కలిసి నిజామాబాద్‌లోని 50 క్వార్టర్స్ నాగారం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో సౌమ్య ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం బంధువులు, తెలిసినవారి వద్ద ఆరా తీశారు.
అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో ఐదో టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సౌమ్య ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఆమె ఆచూకి తెలిసిన వారు ఐదో టౌన్ పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ సునీల్ కోరారు. సమాచారం ఉంటే ఎస్‌ఐ సునీల్: 8712659844, ఐదో టౌన్ పోలీస్ స్టేషన్: 8712659727 నంబర్లకు తెలియజేయాలని సూచించారు.
