HomeHEALTHఈనెల 8 న చేప ప్రసాదం పంపిణీ .....నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పట్లు

ఈనెల 8 న చేప ప్రసాదం పంపిణీ …..నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పట్లు

హైదరాబాద్‌లో బత్తిని కుటుంబ సభ్యుల చేప ప్రసాదం ఈనెల 8 న పంపిణీ చేయడానికి ఏర్పట్లు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా వచ్చే లక్షలాది మంది ఆస్తమా బాధితులకు ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంటారు.

సోమవారం  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ స్వయంగా పరిశీలించారు.

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఒకేసారి దాదాపు 60 వేల మంది చేప ప్రసాదం తీసుకునేలా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణతో పాటు దేశంలోని పలు  రాష్ట్రాల నుండి, విదేశాల నుండి లక్షలాది మంది ఆస్తమా బాధితులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా.. అత్యవసర సేవల కోసం అంబులెన్సులు, అవసరమైన మందులు, సీపీఆర్ శిక్షణ పొందిన వైద్య సిబ్బంది మరియు వలంటీర్లను అందుబాటులో ఉంచారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments