HomeHEALTHరెడ్ క్రాస్ తలసేమియా ఆసుపత్రిని సందర్శించిన జిల్లా జడ్జి....

రెడ్ క్రాస్ తలసేమియా ఆసుపత్రిని సందర్శించిన జిల్లా జడ్జి….

గాంధీ జయంతి పురస్కరించుకొని నిజామాబాదు జిల్లా జడ్జి సునీత కుంచాల రెడ్ క్రాస్ లోని తలసేమియా వార్డ్ ని సందర్శించారు. అలాగే పిల్లలకు పండ్లు అందచేసి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

అలాగే జిల్లా రెడ్ క్రాస్ గణనీయమైన సేవలను అందిస్తూ రాష్ట్ర స్థాయిలోనే బంగారు పతకాలు అందుకొని ఆదర్శంగా నిలిచిందన్నారు.

భవిష్యత్తులో జాతీయస్థాయిలోనూ జిల్లా కీర్తిని ఇనుమడింప చేయాలన్నారు .రెడ్ క్రాస్ సేవలు జిల్లాలో విశృతంగా జరుగుతున్నాయని అభినందించారు .రక్త నిధి సేవలు సైతం ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయనీ తెలిపారు.

సంస్థ అందరికీ అందుబాటులో ఉండి విశిష్టమైన విలక్షణమైన సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తుందనీ తెలిపారు. తదుపరి రక్త దాతల సమన్వయ కర్త నరాల సుధాకర్ గారిని చేపడుతున్న సేవలకు సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, డా.నీలి రాంచందర్ ,నిజామాబాదు డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం,మోపాల్ మండల చైర్మన్ వెంకటేశ్వరులు, మెడికల్ ఆఫీసర్ డా.రాజేష్ , నాగేందర్ ,పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments