HomeTelanganaNizamabadమహాత్మ గాంధీ సేవలు మరువ లేనివి...జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి..

మహాత్మ గాంధీ సేవలు మరువ లేనివి…జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి..

ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి మరియు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ,నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

అదేవిధంగా తిలక్ గార్డెన్ వద్ద గల లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి గాంధీచౌక్లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలు గుర్తించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని, స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారి పాత్ర ఎన్నటికీ మరువలేనిదని, ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని మానాల మోహన్ రెడ్డి అన్నారు.మహాత్మ గాంధీ గారు చూపిన మార్గం శాంతి అహింస అనేవి ప్రజలను ఎన్నటికీ తప్పుదోవ పట్టించకుండా చూసే గొప్ప మార్గ నిర్దేశాలని ఆయన అన్నారు .

కానీ ప్రస్తుతం దేశంలో మహాత్మా గాంధీ గారిని తక్కువ చేసే విధంగా కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారిని తక్కువ చేసి గాంధీని చంపిన గాడ్సేను గొప్ప వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని దానిని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రజల పైన ఉందని ఆయన అన్నారు.

గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి మాహత్మ గాంధీ అని గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చిన వ్యక్తి అని ఆయన మార్గంలోనే రాజీవ్ గాంధీ గారు కూడా గ్రామాలకు స్వేచ్ఛను ఇచ్చి గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా ప్రోత్సహించిన వ్యక్తి అని కావున వారి ఆలోచనలను ఆశయాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రజల పైన ఉందని మానాల మోహన్ రెడ్డి అన్నారు.

అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశానికి ప్రధానిగా ఎన్నో సేవలు చేశారని దేశం ఆర్థికంగా బలపడుతూ ముందుకు వెళ్లడానికి ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారని వారిద్దరి సేవలు ఎన్నటికీ మరువలేనివని మరొకసారి మహాత్మా గాంధీ గారికి లాల్ బహుదూర్ శాస్త్రి గారికి మానాల మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మాజీ పీసీసీ కార్యదర్శి రం భూపాల్,జిల్లా NSUI అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా సేవల అధ్యక్షుడు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్ ,మాజి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, కోనేరు విజయలక్ష్మి,కోర్వ రాజేందర్, కైసర్, నరేంద్ర సింగ్, ప్రమోద్ లవంగ మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments