HomeCRIMEపోగొట్టుకున్న 125 సెల్ ఫోన్లు రికవరి..

పోగొట్టుకున్న 125 సెల్ ఫోన్లు రికవరి..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న 125 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. రికవరీ చేసిన 125 సెల్ ఫోన్ లు శుక్రవారం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన బాధితులకు అందజేశారు.

ఈ మద్య కాలంలో నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో సెల్ ఫోన్స్ లు పోయినవారివి దాదాపు 125 ఫోన్ లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరి చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .

ప్రతీఒక్కరు వారి సెల్ ఫోన్లను వాడడంలో అప్రమత్తంగా ఉండాలని , సైబర్ నేరాల పట్లకూడా అప్రమత్తంగా ఉండాలని , ఎవ్వరైనా వారి సెల్ ఫోన్ పోయినట్లయితే వారు www.ceir.gov.in వెబ్సైటులో వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలనీ అన్నారు.

అలా చేసినట్లయితే త్వరగా వారి సెల్ ఫోన్స్ ను పట్టుకోవడం జరుగుతుందని కావున ప్రజలు ఈ పద్దతిని సద్వినియోగపర్చుకోవాలని తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments