మోకిలా చేవెళ్ల పోలీసు స్టేషన్ లలో నమోదు అయిన కేసుల్లో మాజీ ఎమ్మెల్యే బిఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఊరట దక్కింది. ఆయను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. అయితే ఆయా కేసులో పోలీసుల విచారణకు సహకరించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
తన భూమి ని జీవన్ రెడ్డి బలవంతంగా లాక్కున్నారని సామ దామోదర్ రెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసులు నమోదు అయ్యాయి. జీవన్ రెడ్డి తో పాటు తల్లి భార్య ల మీద కూడా కేసులు నమోదు చేసారు.
దీనిపై జీవన్ రెడ్డి హైకోర్టు ను ఆశ్రయించారు. తమపై నమోదు అయిన కేసులను కొట్టేయాలని అలాగే ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అభ్యర్థించారు. కానీ భార్యకు తల్లి ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు జీవన్ రెడ్డి పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
దీనితో జీవన్ రెడ్డి సుప్రీంకోర్టు లో స్పెషల్ లివ్ పిటిషన్ దాఖలు చేశారు. జీవన్ రెడ్డి తరుపున సీనియర్ న్యాయవాదులు ముఖిల్ రోహిత్గి,నిరంజన్ రెడ్డిలు వాడివేడిగా వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు లో ఊరట దక్కడంతో జీవన్ రెడ్డి శుక్రవారం మోకిలా పోలీసు స్టేషన్ కు విచారణకోసం వెళ్లారు.
