నిజామాబాద్ జిల్లా జూక్కల్ నియోజకవర్గం లో పదవ తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి ఆదేశానుసారం బిఆర్ యస్ వి జిల్లా యువజన నాయకులు అభిలాష్ అద్వర్యం ఆందోళన చేసారు
ప్రభుత్వ చేతగానితనం వల్ల అధికారుల అసమర్థతవల్లే నకిరేకల్, మంచిర్యాల, వికారాబాద్, జుక్కల్ లో ప్రశ్న పత్రాల లీకు అవుతున్నాయన్నారు రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు పరీక్షలు నిర్వహిస్తే నాలుగు ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం చూస్తుంటే విద్యాశాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుందన్నారు .
కార్పొరేట్ పాఠశాలలతో కుమ్మక్కై కాంగ్రెస్ ఎమ్మెల్యేలే లీకులకు పాల్పడటం సిగ్గుచేటు అన్నారు పరీక్షలు సరిగ్గా నిర్వహించమని కోరితే కేటీఆర్ గారిపై నకిరేకల్ లో అక్రమకేసు పెట్టారుముఖ్యమంత్రి పేషి నుండి ఆర్డర్ రాగానే సెకండ్లలో కేసులు నమోదు చేస్తున్నారు..
పేపర్ లీకేజీ కేసులో అసలు నిందితులను తప్పించారని ఆయన ఆరోపించారు ..ఈ సమావేశం లో సొంతే చిన్నారం(రమేష్).ప్రశాంత్.మధు.గంగాధర్.నితిన్. యునుస్.రాజు.అజయ్.తదితరులు పాల్గొన్నారు………
