Monday, April 20, 2026
HomeTelanganaNizamabadడబుల్ బెడ్ రూమ్ ఇండ్లనుఅర్హులైన పేదలకు ఇవ్వాలి -అర్బన్ ఎమ్మెల్యే

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లనుఅర్హులైన పేదలకు ఇవ్వాలి -అర్బన్ ఎమ్మెల్యే

నాగారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు వెంటనే ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు ఆయన శుక్రవారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారుఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు సామాన్యుని సొంతింటి కల సాకారం కోసం కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి అవస్ యోజన కింద దేశమంతా ఇండ్లు నిర్మించి అర్హులైన పేదలకు ఇస్తుంటే తెలంగాణకు అవస్ యోజన కింద నిధులు కేటాయిస్తే వాటిని పక్కదారి పట్టించిన ఘనత గత ముఖ్యమంత్రి కెసిఆర్ ది అన్నారు…

పేదోనికి సొంతింటి కల కలగానే మారిన పరిస్థితి తెలంగాణాలో ఉందని గత ప్రభుత్వం BRS అల్లుడు వస్తే ఏడ పండుకోవాలి..? మేకను ఏడ కట్టేయాలి..? కోళ్లను ఏడ కమ్మలి..? ఆడపిల్ల స్నానం చేసి బట్టలు ఏడ మార్చుకోవాలి..?

ఆడబిడ్డ ఆత్మగౌరవం కదా అని కెసిఆర్ మాయమాటలు చెప్పి10 ఏళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేసిండని అన్నారు..నిజామాబాదు అర్బన్ లో గత పదేళ్లనుండి ఒక్క ఇల్లు ఇచ్చిన పాపానపోలెదని అన్నారు సొంతింటి జాగా ఉంటే ఐదు లక్షలు ఇస్తానని వాటికీ కూడా దిక్కులేకుండా పోయిందని అన్నారు •

అర్బన్ లో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలావస్థలో , కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని, డోర్స్, కిటికీలు, ఎలక్ట్రిసిటీ సామాగ్రి దొంగలు అపహారించరని ప్రజాధనం కోట్ల రూపాయలు వృధా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు, కట్టిన నిర్మాణాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగామారాయన్నారు అన్నారు.డబుల్ బెడ్ రూమ్ అభ్యర్థుల ఎంపిక•

దారిద్య రేఖకు దిగువ ఉన్నవాళ్లకు

• గుడిసెలు, రేకుల ఇండ్లు, కిరాయి కి ఉంటున్నవారు అర్హులు

• అభ్యర్థుల ఎంపిక అర్బన్ లో SC -17%, ST – 6%,మైనారిటీ – 12% మిగతా కులాల వారికీ సమానంగా ఎంపిక చేయాలన్నారు కానీ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ GO తుంగలో తొక్కి తన ఇష్టం వచ్చినట్లు పార్టీ నాయకులకు, మైనారిటీల ఓట్ బ్యాంకు కోసం 43% లిస్ట్ ఎంపిక చేసి మిగతా వర్గాలకు అన్యాయం చేసారన్నారు గతంలో తాను ఇదే డబుల్ బెడ్ రూమ్ లపై ఎన్నో ఉద్యమాలు చేసారని ,ఎమ్మెల్యే అయినా తరువాత కూడా అధికారులను డబుల్ బెడ్ రూమ్ అభ్యర్థుల జాబితా ప్రభుత్వ GO ప్రకారం అర్హులైన వారికీ కేటాయించాలి ఆదేశించడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ్మా ఇండ్లు అని చెప్పింది ఇప్పటికి ఒక ఇండ్లు కూడా దిక్కులేదని,గత ప్రభుత్వం మోసం చేసినట్లు కాకుండా ప్రభుత్వం వెంటనే కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మరమ్మతులు చేసి అర్హులైన వారికీ దీపావళి వరకు కేటాయించాలని లేదంటే ప్రజల పక్షాన పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతాం అని హెచ్చరించారు.

ప్రభుత్వం ఇస్తానన్న ఇందిరమ్మ ఇండ్ల కింద అర్బన్ నియోజకవర్గనికి 7,500 ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేసారు స్థలం ఉన్నవారికి కట్టుకోవడానికి 5 లక్షల ఆర్ధిక సహాయం కూడా అందించాలని డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!