HomeTelanganaNizamabadడాక్టర్ రవీందర్ కు 2025 జాతీయ ఐకాన్ అవార్డు...

డాక్టర్ రవీందర్ కు 2025 జాతీయ ఐకాన్ అవార్డు…

తెలంగాణ విశ్వవిద్యాలయం, సారంగాపూర్ బీ.ఈడీ. కళాశాలలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్. ఎస్. రవీందర్ కి త్రేతా యుగ్ ఫౌండేషన్ వారు నేషనల్ ఐకాన్ అవార్డు -2025ను ఎంపిక చేశారు.

ఈ అవార్డును భారతదేశంలోని టాప్100 ప్రొఫెసర్లను గుర్తించి ఈ అవార్డును ప్రధానం చేస్తారు. డాక్టర్ రవీందర్ త్రేతా యుగ్ ఫౌండేషన్ నుంచి లభించిన మూడో అవార్డు ఇది. భారతదేశంలోని టాప్ ఐకాన్ ప్రొఫెసర్ -2025లో తన పేరుని త్రేతా యుగ్ ఫౌండేషన్ వారు గుర్తించి ఎంపిక చేయడం పట్ల వారు హర్షాన్ని వ్యక్తం చేశారు.

ఇటీవల తనకు నీతి ఆయోగ్ చే గుర్తించబడిన త్రేతా యుగ్ ఫౌండేషన్ నుంచి ఇంటర్నేషనల్ టీచర్ ఎక్సలెన్స్ అవార్డు మరియు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు 2025 లకు ఎంపిక కాబడినారు.

భారతదేశంలోని టాప్ 100 ప్రొఫెసర్ ఐకాన్ ఆఫ్ 2025 కి ఎంపిక కావడం తనకు వ్యక్తిగతంగానే కాకుండా తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఈ విజయం అంకితం చేస్తున్నానని వారు ఆకాంక్షించారు.

తనకు ఈ అవార్డు రావడం పట్ల టి.యు.మాజీ రిజిస్టర్ ప్రొఫెసర్ బలరాం నాయక్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, తె.వి. వి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాజీ డీన్ సీనియర్ ప్రొఫెసర్ టి.మృణాళిని, సీనియర్ ప్రొఫెసర్ పడాల ప్రసాద్, టి.యు. డిపార్ట్మెంట్ ఆఫ్ బోటనీ సీనియర్ ప్రొఫెసర్ అరుణ, ప్రొఫెసర్ కైసర్ మహమ్మద్, ప్రిన్సిపాల్ డాక్టర్ బి. సాయిలు, డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ పున్నయ్య, డాక్టర్ నాగ రాజు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఆర్. కరుణాకర్, డాక్టర్ వి.శ్రీనివాస్, సువర్చల, పోలపల్లి శ్రీకాంత్, హరిత, గణేష్, నరేందర్, మరియుబోధ నేతర సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments