నాణ్యత లేని నాసిరకం వస్తువుల ఉపయోగం..కొంత మంది విద్యార్థి సంఘాల నాయకులు చందాల కోసం కాంట్రాక్టర్లతో చేతులు కలిపి ఇంతటి ఘోరమైన వ్యవహారం నడిపిస్తున్న వైనంపైసలు ఇవ్వనంటే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని కాంట్రాక్టర్ల ఆరోపణ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్ లోని మెస్ స్టోర్ లో పూర్తిగా నాసిరకం మరియు వినియోగం తేదీ అయిపోయిన వస్తువులను వాడడం గుర్తించి విద్యార్థులు ఆందోళనకు దిగారు
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం వెనుక కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కాంట్రాక్టర్లను చందాల కోసం వేధించడంతో మరియు కాంట్రాక్టర్లను ఒప్పించి పైసలు మిగిలించుకోవడానికి నాసిరకమైన వస్తువులను సరఫరా చేయించడం జరుగుతుంది
కొంతమంది విద్యార్థి సంఘాల నాయకుల అండతోనే ఇలాంటి వ్యవహారం ఓల్డ్ బాయ్స్ హాస్టల్ లో జరిగిందని విద్యార్థులు గుర్తించి ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది
అక్కడికియూనివర్సిటీ రిజిస్టార్ చీఫ్ వార్డెన్ ప్రిన్సిపల్ అధికారులు వచ్చి కాంట్రాక్టర్లతో మాట్లాడటం జరిగింది కాంట్రాక్టర్లు ఎవరు వారిని బెదిరించారు చందాలు వసూలు చేశారో వాళ్లు ఒప్పుకోవడం జరిగింది దీనితో అక్కడున్న రిజిస్టర్ ప్రిన్సిపల్ మరియు అధికారులు
ఈ వ్యవహారంపైపూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఓల్డ్ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు వారి యొక్క ధర్నాను విరమించడం జరిగింది
