నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ అని చెప్పి ఫోన్ టోకరా చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. సీఐ విజయ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం. ఓ గుర్తు తెలియని వ్యక్తి నగరంలోని ఓ మొబైల్ షాప్ కి ఫోన్ చేసాడు.
డాక్టర్ కి ఫోన్ కావాలి జీజీహెచ్ కి ఫోన్ తీసుకొని రావాలని కోరారు. అందుకు షాప్ యజమాని వర్కర్ తొని రూ.90 వేల విలువైన సెల్ ఫోన్ పంపించాడు.సదరు అపరిచితుడు వర్కర్ ని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్ కు ఎదురుగా వున్న రూంలో కూర్చోబెట్టి సెల్ ఫోన్ తీసుకొని వెనక డోర్ నుంచి పరారయ్యాడు.
ఎంత సేపటికీ రాక పోవడంతో వర్కర్ షాప్ యజమానికి తెలిపాడు.దీంతో యజమానికి ఒకట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
