నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న ఎండు గంజాయి పట్టుకున్నట్లు సీఐ రఘుపతి పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమాదాస్పదంగా తిరుగుతున్న నవీపేట్ మండలం నలేశ్వరం కు చెందిన బీస ప్రవీణ్ ను పట్టుకొనీ బ్యాగ్ ని తనికి చేయగా అందులో 250 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇట్టి వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా తెలిపినారు. గంజాయి పట్టివేతలో కీలకపాత్ర పోషించిన ఎస్సై మొగులయ్య మరియు సిబ్బంది ని అధికారులు అభినందించారు.
