పోలీస్ శాఖ దసరా పండగ ను ఘనంగా నిర్వహించారు.కమిషనర్ ఆయుధ పూజ నిర్వహించారు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లలో దనరాపండుగ పురస్కరించుకొని ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆయుద పూజ, మరియు వాహనాలకు పూజా, మరియు బి.డి టీమ్ సామాగ్రికి పూజా,కార్యాక్రమాని గురువారం ఉదయం 11:30 గంటల సమయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, నిర్వహించారు. ఆయుద పూజా అనంతరం పోలీస్ కమిషనర్ ఎ.కె 47 ఆయుదంతో 5 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ గారు ఈ దసరా అందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) జి. బస్వారెడ్డి, అదనపు డి.సి.పి (ఎ.ఆర్ ) శ్రీ రామచందర్ రావు, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, తిరుపతి, శేఖర్ బాబు, మరియు ఎమ్.టి సెక్షన్ పోలీస్ సిబ్బంది, బీ.డీ టీం సిబ్బంది,ఆర్మూడ్ రిజర్వు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
