దసరా అంటే సరదాలకు, సందళ్లకు మరొక పదం. ఆట పాటలకు ఆలవాలం. ఇంటిల్లిపాదీ నూతన దుస్తులు ధరించి రకరకాల పిండి వంటలు, నాన్వెజ్ వంటకాలతో ఆనందంగా గడిపారు. విజయదశమి పర్వదినం సందర్భంగా పట్టణంలోని దేవాలయాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి.
భక్తుల రద్దీతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి.అదేవదంగా వాహన పూజలు ఆయుధ పూజలు చేశారు. నూతన వస్త్రాలు ధరించి ప్రజలందరూ ఒక చోటకు చేరుకొని అక్కడి నుంచి డప్పు వాయిద్యాలతో పాలపిట్ట కోసం, జమ్మి ఆకు కోసం చెట్టు వద్దకు వెళ్లి వేద బ్రాహ్మణ పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.
అనంతరం చిన్న,పెద్ద యువత తేడా లేకుండా ఒకరితో ఒకరు అలయ్ బలాయి తీసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
