HomeTelanganaNizamabadఅభివృద్ధి, సంక్షేమమే మా అజెండా: దువ్వా వనజ..

అభివృద్ధి, సంక్షేమమే మా అజెండా: దువ్వా వనజ..

36 వ డివిజన్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సాంకేతికతతో కూడిన పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యమని బీఆర్ఎస్ అభ్యర్థి దువ్వా వనజ అన్నారు. శనివారం ఆమె డివిజన్ పరిధిలో పర్యటించి స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆకర్షణీయమైన హామీలను ప్రకటించారు.

డివిజన్ సమస్యల పరిష్కారానికి వినూత్నంగా ఒక మొబైల్ యాప్‌ను తీసుకువస్తామని వనజ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, ఆ ఫిర్యాదు ఏ దశలో ఉందో కూడా స్వయంగా తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తామని స్పష్టం చేశారు. అలాగే, వృద్ధులు పెన్షన్ కోసం బ్యాంకుల వద్ద క్యూ కట్టే అవసరం లేకుండా, నేరుగా ఇంటి వద్దకే పెన్షన్ అందజేసేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా ‘కామన్ సర్వీస్ సెంటర్’ ఏర్పాటు చేస్తామని, యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, ఉద్యోగ అవకాశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, ప్రతి వీధిని పరిశుభ్రంగా ఉంచుతామన్నారు.

భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు, నాగులు పార్కుల వంటి ప్రజా ప్రదేశాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments