జక్రాన్ పల్లి మండలం లోని అర్గుల్ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మూర్ నుంచి పడకల్ గ్రామానికి 8 మందితో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ చిన్నయ్య ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు.
మరో 7 గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న జక్రాన్‌పల్లి ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
