Monday, May 4, 2026
HomeCRIME1.3 కేజీల గంజాయి పట్టివేత..ఇద్దరు వ్యక్తులు అరెస్టు .

1.3 కేజీల గంజాయి పట్టివేత..ఇద్దరు వ్యక్తులు అరెస్టు .

అక్రమంగా రవాణా చేస్తున్న ఎండు గంజాయినీ పట్టుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఎక్సైజ్ పోలిసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం..

ఇన్స్పెక్టర్ కె.స్టీవెన్సన్, ఎస్ఐ చంద్రమౌళి లు పోచంపాడు వద్ద రూట్ వాచ్ చేసే సమయంలో నిర్మల్ నుండి ఆర్మూర్ వైపు వస్తున్న సబ్లె ప్రకాష్, బరదవల్ గవాస్కర్ ను వ్యక్తులను పోచంపాడ్ జాతీయ రహదారిపై ఆపి తనికి చేయగా వారి వద్ద 1.3. కేజీ ల ఎండు గంజాయినీ పట్టుకున్నట్లు తెలిపారు.

వారిని పట్టుకొని విచారించగా ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి వద్ద కొనుగులు చేసి అధిక లాభం కోసం పోచంపాడు చుట్టూ పక్కల గ్రామాల యువకులకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.

వారినుంచి 1.3కేజీ ల గంజాయిని స్వాదీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ దాడిలో ఎక్సైజ్ సాయిలు,వికాస్ గౌడ్,సందీప్,నరేష్, ధర్మెందర్,శ్రీనివాస్,సాగర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!