HomeCRIMEబీసీ హాస్టల్ లో ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి

బీసీ హాస్టల్ లో ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఉన్న బీసీ బాలికల వసతి గృహం విద్యార్థి శ్రావణి బుధవారం హఠాత్తుగా మృతి చెందారు . ఎనిమిదో తరగతి చదువుతున్న శ్రావణి బుధవారం ఉదయం 5 గంటలలకు హాస్టల్లో కాలకృత్యులు తీర్చుకోవడానికి వెళ్లి బయటికి వచ్చి కింద పడిపోయింది తోటి విద్యార్థినులు హాస్టల్ సిబ్బంది.

హుటాహుటిన అంబులెన్స్ ద్వారా విద్యార్థిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు విద్యార్థినిని పరీక్షించి ముందే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద రోదిస్తున్నారు.

నస్రుల్లాబాద్ మండలం హాజీపూర్ నకు చెందిన విద్యార్థిని శ్రావణి మృతి కి గల కారణాల ఫై అధికారులు ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు .. గుండెపోటుతో మృతి చెందిందా లేక ఇతర కారణాల ఏవైనా ఉన్నాయా అనేది అరా తీస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments