బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి వెల్లడి..ఆపరేషన్ సింధూర్ ఘన విజయం సాధించినందుకు భారత సైన్యానికి సంఘీభావంగా ఇందూరులో తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పేర్కొన్నారు.ఆదివారం జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఆద్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా, జాతీయ గౌరవానికి సంకేతంగా, దేశం కోసం నేను సైతం నినాదంతో ఇందూర్ నగరంలో భారీ తిరంగా ర్యాలీని సోమవారం,సాయంత్రం 4:00 గంటలకు రాజరాజేంద్ర చౌరస్తా (RR చౌరస్తా) నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాక్ ఉగ్రవాద కేంద్రాలపై,స్థావరాలపై జరిపిన దాడిని ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని తెలిపారు.
ఈ ర్యాలీని ప్రజలందరూ సంఘీభావంతో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి నాయకులు పాల్గొన్నారు.
