HomeCRIMEతాళం వేసిన షాపులో చోరీకి యత్నం..

తాళం వేసిన షాపులో చోరీకి యత్నం..

తాళం వేసిన షాపులో చోరీకి యత్నం జరిగింది. ఈ ఘటన నిజామాబాద్ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

చంద్ర నగర్ కు చెందిన గుజ్జ రవికృష్ణ తన ఆఫీసు ఎన్టీఆర్ చౌరస్తాలోని శ్రీ మోక్ష రెస్టారెంట్ ఎదురుగా ఉన్న ఆర్కే బిల్డర్స్ షాప్ ను ఎప్పటిలాగే తన యొక్క షాపును శనివారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు తాళం వేసి వెళ్ళారని తెలిపారు.

మరుసటి రోజు ఆదివారం ఉదయం 10 గంటలకు ఆఫీసుకు వచ్చి చూసేసరికి తన యొక్క ఆఫీసు ఆర్కే బిల్డర్స్ యొక్క షట్టర్ తాళాలు పగలగొట్టి ఉన్నట్లు తెలిపారు.

ఫిర్యాదు లోపలికి వెళ్లి పరిశీలించక ఆఫీసులోని వస్తువులు అన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. లాకర్ రాక్స్ తాళాలు పగలగొట్టి తెరిచి ఉన్నట్లు తెలిపారు
కానీ షాప్ లో ఎటువంటి వస్తువులు కూడా దొంగిలించబడలేదనీ తెలిపారు.

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments