అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న ఓ కానిస్టేబుల్ పై రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అరీఫ్ తెలిపారు.ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..
నగరంలోని ఇందిర ప్రియదర్శిని కాలానికి చెందిన కల్వరే గంగాధర్ మెండోర పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.గత కొన్ని సంవత్సరాలుగా అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారి నుంచి సేల్ డిడ్ కింద భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని తెలిపారు.
ఈ మేరకు నగరంలో ఓ మహిళకు గంగాధర్ రూ.8 లక్షలు వడ్డీకి ఇచ్చి వారి నుంచి బలవంతంగా మూడు స్థలాలను సేల్ డిడ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని తెలిపారు.
దీంతో సదరు మహిళ గంగాధర్ పై రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ఎస్ఐ అరీఫ్ చేస్తున్నట్లు తెలిపారు.
