అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి బిఆర్ యస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే లు ఇంకా కోలుకోలేక పోతున్నారు. నియోజకవర్గాలవైపు కన్నెత్తి చూడలేక పోతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో క్యాడర్ కు భరోసా గా వుండాల్సిన మాజీ లు ఓడిపోయాక మొహం చాటేస్తుండడం గమనార్హం.ఎమ్మెల్యే ల అండతో మొన్నటి దాక చెలరేగి పోయిన కింది స్థాయి నేతలు సైతం రూట్ మార్చేశారు.
ఇప్పుడు తమ దందా యధావిధిగా సాగించడానికి అధికార పార్టీ నేతలతో మమేకం అయిపోతున్నారు.అక్రమ దందా ల్లో వాటాలిచ్చేస్తు తూన్నారు. మొన్నటి దాక బిఆర్ యస్ ఎమ్మెల్యే లవద్ద యథేచ్ఛగా అక్రమ దందాలు చేసిన చోట నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సందడి చేస్తున్నారు. ఎన్నికల తర్వాత మాజీ ఎమ్మెల్యే లు కనీసం పట్టించుకోక పోవడంతో చాల మంది కింది స్థాయి నేతలు తమ దారి తమదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
బిఆర్ యస్ అధికారంలో వుండగా దాదాపు దశాబ్ద కాలం పాటు పార్టీ ,పాలనా వ్యవస్థల్లో తిరుగులేని పెత్తనం చెలాయించిన ఎమ్మెల్యే లు ఎన్నికల్లో ఓటమి పలకరించడం పార్టీ అధికారం కోల్పోవడంతో కళ్ళు బైర్లు కమ్మేశాయి.ఎమ్మెల్యే లుగా నియోజకవర్గాల్లో అసాంఘిక శక్తులను పెంచి పోషించారు. అనేక అక్రమ దందాల నుంచి నిసిగ్గుగా వాటాలు తీసుకున్నారు.
కల్తీ కల్లు… మద్యం సిండికేట్ …మొరం ,ఇసుక…. కంకర క్వారీ లతో పాటు రియల్టర్ల ను వాటాల కోసం ముప్పు తిప్పలు పెట్టిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. తమ చుట్టూ ఉండే ఒకరిద్దరిని బినామీ లు పెట్టి అనేక మంది ఎమ్మెల్యే లు గుత్తేదార్లుగా అవతారం కూడా ఎత్తారు. ఓ ఎమ్మెల్యే సీఎంఆర్ బియ్యం దందా లో కోట్ల రూపాయల సర్కార్ సొమ్ము కొల్లగొట్టాడు. మరో ఎమ్మెల్యే పీడీఎస్ మాఫియా నుంచి ముడుపులు మెక్కేది.
ఎమ్మెల్యే లుగా పనిచేసిన పదేళ్ల కాలం లో అనేక అక్రమ దందాలను పెంచి పోషించారు.మెజార్టీ ఎమ్మెల్యే లు ఇలాంటి మరకలు అంటించుకున్నవారే. అందుకే ఎన్నికల్లో ఓడిపోవడంతో నియోజకవర్గాల్లో అక్రమ దందాలు గుట్టు రట్టవుతుందనే వణుకు మాజీ ఎమ్మెల్యే లను ఇంకా వెంటాడుతుంది. అందుకే నియోజకవర్గాలకు చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారు. అసలు ప్రజా సమస్యలు పట్టించుకోవడానికి కనీస ఆసక్తి చూపడం లేదు.
ద్వితీయ శ్రేణి నేతల్లో ఒకరిద్దరితో టచ్ లో వుంటున్నారు. అసలు అసెంబ్లీ ఎన్నికల్లో తామెందుకు ఓడింది ఏ ఒక్కరూ కనీసం ఆత్మ పరిశీలన చేసుకోలేదు. తమసాగించిన దోపిడీ దందా లతో ఎలాంటి మూల్యం చెల్లించుకుంది మననం చేసుకోలేక పోతున్నారు. ఇంకా అదే మేక పోతూ గాంబీర్యం తో వ్యవహరిస్తున్నారు. ఓడిపోయాక మాజీ ఎమ్మెల్యే లు నియోజకవర్గాల నుంచి బిచానా ఎత్తేసారు. ఓ మాజీ ఇంకా దుబాయి చెక్కేసి అక్కడే సెటిల్ అయ్యారు.
మరో మాజీ దుబాయి తరుచు వెళ్తూ రిలాక్స్ అవుతూ వస్తున్నారు. లోకసభ ఎన్నికల్లో అయిదారు రోజులు ఎదో హడావుడి చేసిన మాజీ ఎమ్మెల్యే లు ఆతర్వాత పార్టీ క్యాడర్ తో టచ్ లో లేకుండా పోయారు.అధికారం కోల్పోయాక కొంత కాలం దిక్కులు చూసిన కిందిస్థాయి నేతలు మాజీలు అడ్రస్ లేకుండా పోవడంతో ఆత్మ రక్షణ లో పడ్డారు. అందుకే కండువా లు మార్చేశారు.
నియోజకవర్గాల్లో ఆ మాజీ లను కాదని అధిష్ఠానము సైతం మరో నేతకు పెత్తనం అప్పగించే స్థాయిలో లేకుండా పోయింది. మాజీ లను పక్కకు కొత్త నేతలను తెరమీదికి తెస్తేనే పార్టీకి పూర్వ వైభవం వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఇప్పట్లో మాజీ లను కాదని ఆ ప్రయోగం చేసే సిన్ అధినేత కు లేదు. మాజీ ఎమ్మెల్యే లు తమకు తాముగా పార్టీ వీడివెళ్తే తప్పా ఆయా నియోజకవర్గాల్లో కొత్త తరం నాయకత్వం వచ్చే అవకాశం లేనట్లే .