HomeCRIMEఅక్రమ అరెస్టులను విడనాడాలి...

అక్రమ అరెస్టులను విడనాడాలి…

బైండ్ ఓవర్ల పేరుతో కార్మికులపై వేధింపులను ఆపాలి.ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట మున్సిపల్ కార్మికులతో కలిసి నిరసన.. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్.

బైండ్ ఓవర్ల పేరుతో కార్మికులపై వేధింపులను,అక్రమ అరెస్టులను విడనాడాలనీ సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నగరంలోనిఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట మున్సిపల్ కార్మికులతో కలిసి నిరసన చేశారు.

ఆయన మాట్లాడుతూ.. అనవసర విషయాల పైన, సంబంధం లేని కార్యక్రమాల పైన పై నుండి పేర్లు వచ్చినాయి అనే పేరుతో వివిధ రంగాల కార్మికులను, ప్రజా సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తూ బైండోవర్ల పేరుతో నిర్బంధించటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని.

జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు విమర్శించారు. ఒకవైపు ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ నిరసన కార్యక్రమాలను తెలియజేయాలని అందుకొరకు ధర్నా చౌక్ ను ప్రారంభిస్తున్నట్లు చెప్తున్నప్పటికీ.

ఆచరణలో మాత్రం దానికి విరుద్ధంగా నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడం కొరకు తమ అభిప్రాయాలను వెల్లడించకుండా అంచి వేసే పద్ధతుల్లో ముందస్తు బైండోవర్ల పేరుతో అక్రమ అరెస్టులను జిల్లా పోలీసులు చేస్తున్నారని.

ఇది సరైన పద్ధతి కాదని. ఏ సంబంధం లేని కార్యక్రమాలలో పాల్గొనని మున్సిపల్ ఆటో డ్రైవర్లను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్వహించడాన్ని నిరసిస్తూ పోలీస్ ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట మున్సిపల్ కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ముకుల విధులకు ఆటంకం కల్పించకూడదని కోరారు. మున్సిపల్ కార్మికులతో పాటు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ను అట్లాగే సిపిఎం జిల్లా కార్యదర్శి అయిన మహేష్ బాబు అనే తనను బైండోవర్ చేస్తున్నట్లు పోలీసులు గురువనిర్బంధం చేయటాన్ని ఖండించారు.

ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ యూనియన్ నాయకులు భూపతి, ఏకనాథ్, మోహన్, సంతోష్ గౌడ్, శంకర్, తదితరులతోపాటు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments