పేకాట స్థావరం పై దాడి చేసి పట్టుకున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.
విశ్వసనీయ సమాచారం మేరకు నగర శివారులోని ముబారక్ నగర్ గ్రామ శివారులో గల చెరువు కట్ట పై జూదం ఆడుతున్న 5 గురిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
వాళ్ళ నుంచి రూ. 3440 నగదు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.జూదం ఆడుతున్న ఐదుగురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.