రైలు కింద పడి వ్యక్తి ఆత్మ హత్యాయత్ననికి పాల్పడినట్టు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు.ఆయన తెలిపిన వివరాల మేరకు. భీమ్ గల్ గ్రామానికి చెందిన సూర్యవంశీ చంద్రకాంత్ (43).
భార్యా పిల్లలు ఉన్నట్లు తెలిపారు.వృతి రీత్యా కూలీ పనులు చేసుకుంటారు.
నోటి క్యాన్సర్ తో బాధపడుతూ భార్య పిల్లలు వదిలేయడంతో జీవితం పై విరక్తి చెంది నిజామాబాద్ రైల్వే స్టేషన్ లోని నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళుతున్న రైలు కింద పడి ఆత్మహత్య యత్నానికి పాల్పడి తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.