14 కిలోల వెండి అపహరించిన నిద్దుతున్ని పట్టుకున్నారు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ వాడికి చెందిన రాహుల్ అనే సిల్వర్ మర్చంట్ తన వద్ద ఉన్న 14.500 గ్రాముల ఆభరణాలను
ఈ నెల 28 న పాలిష్ నిమిత్తం, తన వద్ద పని చేస్తున్న సునీల్, నదీమ్ లను హైదరాబాద్ కు పంపించినట్లు తెలిపారు. ఈ మేరకు సునీల్, నదీమ్ వస్తున్న రైలు నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోగానే సునీల్ పడుకొని ఉన్నాడు. అది గమనించిన నదీమ్ ఆభరణాల ఉన్న సంచిని పట్టుకొని పారిపోయినట్లు పేర్కొన్నారు.
సునీల్ నిద్రలేచి చూసేసరి కంటే నదీ ఆభరణాల సంచి తీసుకొని పరారీ అయినట్టు సిల్వర్ మర్చంట్ యజమాని రాహుల్ కు ఫోన్ చేసి సమాచారం తెలిపాడు.
సమాచారం అందుకున్న మర్చంట్ యజమాని రాహుల్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు పట్టి విచారించారు.
ఆ వ్యక్తి వద్ద ఉన్న సంచిని తనిఖీలు చేయగా సంచిలో ఆభరణాలు బయటపడ్డాయి. ఈ మేరకు పోలీసులు నిందితున్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి వెల్లడించారు.