నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతు గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు ప్రతినిధులని ఓడిపోయిన వారు కాదని ప్రజలు సమస్యలపై తమని అడుగుతారని తను ఎమ్మెల్యే గా గెలిచినప్పటి నుండి తన నియోజకవర్గం అభివృద్ధికి ఒక్క రూపాయి వచ్చిన పాపాన పోలె అని.
కనీసం 100 మీటర్ల రోడ్ వేసిన దాఖలాలు లేవు అని ఇందూర్ అర్బన్ నియోజకవర్గం పైన ఎందుకు వివక్షా అని అన్నారు కొడంగల్ నియోజకవర్గంలో పది శాతం నిధులు తమ నియోజకవర్గానికి ఇచ్చిన ఇందూర్ నగరం బ్రహ్మాండంగా అభివృద్ది చెందుతుందని, తన నియోజకవర్గంలో రోడ్స్, డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేక ప్రజలందరు
నానా ఇబ్బందులు పడుతు కాలు బయట పెట్టలేని పరిస్థితి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మా నగర ప్రజల గోసను అర్ధం చేసుకొని ఇందూర్ నగర అభివృద్ధికి సరిపడ నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ విషయంలో కెసిఆర్ గారు చెప్పింది ఇందూర్ ప్రజలు ఇప్పటికి మరిచిపోలేదని కెసిఆర్ అల్లుడు వస్తే ఏడ పండుకోవాలి..? కోళ్లని ఏడ కమ్మలి..? మేకను ఏడ కట్టేయాలి..? ఆడపిల్ల బట్టలు ఏడ మార్చుకోవాలి..? ఆడబిడ్డల ఆత్మగౌరవ సమస్య కాదా అని బ్రహ్మాండంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తాం అని,
సొంత ఇంటి జాగా ఉంటే 5 లక్షలు ఇస్తామని కళ్ళబోల్లి మాటలు చెప్పి పదేళ్లకు మా నియోజకవర్గంలో నాగారంలో 396,బైపాస్ లో 252 సాలిసాలని ఇల్లు నిర్మించి వాటిని అర్హులైన వారికీ కేటాయించకుండా అవి శిథిలావస్థలో ఉన్నాయని గత ప్రభుత్వం ఇష్టానుసారంగా G. O కు వ్యతిరేకంగా ఎంపిక చేసిన లిస్ట్ రద్దు చేసి నిజమైన అర్హుల జాబితా ఎంపిక చేసి వారికీ
ఇండ్లు కేటాయించాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హులైన వారికీ మంజూరు చేయాలనీ ప్రభుత్వానికి డిమాండ్ చేసారు నిజామాబాదు జిల్లాలో ఎంతో మంది చదువుకున్న యువత ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్ దేశాలకు వెళ్లి కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఉందని గత ప్రభుత్వం 45 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన IT హబ్ ను నిర్మించిన ఇందూర్ జిల్లా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కడం లేదని ఐ ఐటీ హబ్ లో 680 సీటింగ్ సామర్థ్యం ఉన్న సగానికి పైగ ఖాళీలు ఉన్నాయని, కారణం ప్రముఖ పేరున్న కంపెనీలు లేకపోవడమే
అని మంత్రి శ్రీధర్ బాబు కి ఇందూర్ జిల్లాలో IT హబ్ పైన ప్రతేక దృష్టి పెట్టి లీడింగ్ కంపెనీలు తీసుకొచ్చి,అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కోరారు,కాంగ్రెస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తాం అన్నారు కానీ అభివృద్ధికి నిధులు కేటాయించిలేదని జిల్లాలో ఉన్న బోధన్ షుగర్ ఫ్యాక్టరీ,పక్కా జిల్లాలో ఉన్న ముత్యం పేట షుగర్ ఫ్యాక్టరీ తెరవడమే
కాకుండా వాటి అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేసారు ఇందూర్ జిల్లాలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ లో నిత్యం సమస్యలే అని విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్న పరిస్థితి ఉందని యూనివర్సిటీ మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు ఇంజినీరింగ్ కళాశాల కూడా మంజూరు చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.