రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టిన రైతు రుణమాఫీ రెండవ విడత నిధులను మంగళవారం (జూలై 30) ఉదయం 11.00 గంటలకు విడుదల చేయనుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, రైతులు, అధికారుల సమక్షంలో రెండో విడత రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం జరుగుతుందన్నారు.
రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో లబ్దిదారులైన రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొంటారని తెలిపారు.———————-నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయనైనది