వృద్ధుడి అదృశ్యమైన ఘటన నిజామాబాద్ నగరంలో సోమవారం చోటు చేసుకుంది.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.నగరంలోని సాయి నగర్ కూ చెందిన అరిగేలా గంగారం(65).
ఆదివారం నగరంలో ఊర పండగ సందర్భంగా సాయంత్రం సమయంలో వైన్స్ కు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళాడు. రాత్రి అయిన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వైన్స్ వద్దకు చేరుకుని ఆచూకీ కోసం కుటుంబీకులు వెతికారు.
ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐదవ టౌన్ ఎస్ఐ అశోక్ తెలిపారు.