Tuesday, January 20, 2026
HomePOLITICAL NEWSArmoorసైబర్ సవాల్-జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ కేటుగాళ్ల ఆగడాలు

సైబర్ సవాల్-జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ కేటుగాళ్ల ఆగడాలు

సైబరాసురుల ఉచ్చు’లో పడుతున్న అమాయకులు- సవాలుగా మారుతున్న సైబర్ క్రైమ్- ఆదమరిస్తే అంతే సంగతులుజాన సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.

సాధారణ నేరాల కంటే సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. సామాన్యుని నుండి సామంతుల వరకు సైబర్ నేరగాళ్లు ఎవరిని వదలడం లేదు. స్మార్ట్ ఫోన్ల మోజులో పడిన వారిని స్మార్ట్ గా దోచేస్తున్నారు.

మనం ఏమి చేస్తున్నాము… ఏమి చూస్తున్నాము… అన్నదానిని సైబర్ నేరగాళ్లు అంచనా వేస్తున్నారు. వాటిని బట్టి అమాయకులకు గాలం వేస్తున్నారు. దీంతో మన చుట్టూ ” మాటు వేశారా? అన్న అనుమానం వ్యక్తం అవుతుంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న లింకుల లంకెల్లో పడి కొట్టుకొని పోయే ప్రమాదం పొంచి ఉంది.

అనుక్షణం అప్రమత్తంగా ఉంటే తప్ప మన మనుగడ సాధ్యమయ్యేలా కనబడడం లేదు. ఇటీవల జిల్లాలో జరుగుతున్న సైబర్ మోసగాళ్ల ఆగడాలతో ప్రజలు బెంబేలుఎత్తుతున్నారు.

ఈమధ్య నిజామాబాద్ జిల్లాలో సైబర్ కేటుగాళ్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి.

తమకు తెలియకుండానే సైబర్ ఉచ్చులో పడి మోసపోయామని తెలిసి.. ఏమీ తెలియని నిస్సహాయులుగా మారుతున్నారు బాధితులు.

లింకును క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకున్న రైతుమొన్న డొంకేశ్వర్ మండలం గంగ సముందర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి అనే రైతు సైబర్ నేరగాళ్ల మోసానికి గురై తన ఫోన్ లోనికి వచ్చిన లింకును క్లిక్ చేయగా అక్షరాల 4 లక్షల పదహారువేల రూపాయలు ఆయన ఖాతా నుండి ఖాళీ అయ్యాయి.

తను మోసపోయానని తెలియకుండానే సైబర్ ఉచ్చులో పడి తన కూతురు వివాహానికి దాచుకున్న ధనమంతా సైబర్ నేరగాళ్ల జేబులో పడింది.

డబ్బులు పంపకపోతే తండ్రి చేతులు తీసేస్తామని యువతిని బెదిరించిన కేటుగాళ్లుఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి సైబర్ నేరగాళ్లు డబ్బులు పంపించమని ఫోన్ కాల్ లో బెదిరించారు. ఆమె తండ్రి గల్ఫ్ లో పనిచేస్తున్నాడు.

అయితే తన తండ్రి గల్ఫ్ దేశంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడని, కేసు నుంచి తప్పించాలంటే వెంటనే పది వేల రూపాయలు పంపించాలని , ఇకపోతే తన తండ్రి చేతులు నరుకుతామని ఫోన్ లో బెదిరించారు.

ఒకసారి గా అవ్వక్కైనా సదరు యువతి వెక్కివెక్కి ఏడుస్తూ వీడియో కాల్ లో తన తండ్రిని చూపిస్తే పంపిస్తామని పేర్కొంది.

దీంతో సైబర్ నేరగాళ్లు సైలెంట్ అయ్యారు.సైబర్ నేరగాళ్ల కు దడ పుట్టించిన సామాన్యుడుభీంగల్ మున్సిపాలిటీలో గృహ నిర్మాణ పనులు మేస్త్రిగా జీవనాన్ని కొనసాగిస్తున్న మాధవరెడ్డి అనే వ్యక్తి కూతురు హైదరాబాదులో ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చెబుతుంది.

ఆయన కూతురు డ్రగ్స్ కేసులో అరెస్టు చేయబడి ఢిల్లీకి తరలిస్తున్నామని సైబర్ నేరగాళ్లు పోలీస్ అధికారి ఫోటోతో ఉన్న నెంబర్ నుండి వాట్సప్ ద్వారా ఫోన్ చేశారు.

అమ్మాయి ఏడుస్తున్న దేవుని సైతం వినిపిస్తూ 50 వేల రూపాయలు డిమాండ్ చేశారు. ఇది మోసమని గ్రహించిన మాధవరెడ్డి నోటికి వచ్చినట్టు వారిని తిట్టడంతో ఫోన్ కట్ చేశారు.

ఏది ఏమైనా సైబర్ నేరగాళ్ల నుండి ఫోన్ వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించక పోతే వారి ఉచ్చులో పడే ప్రమాదం ఉంది.

మైకులే టార్గెట్ గా కొనసాగుతున్న ఈ సైబర్ నెరజాలపై పోలీసులు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజల అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రజలలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లేదంటే ఏదో ఓ రోజు సైబర్ నేరగాళ్లు మన తలుపును తట్టే ప్రమాదం ఉంది. ప్రజలారా… పారా హుషార్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!