బస్సు ఎక్కబోయి కింద పడి మహిళ మృతి చెందిన ఘటన నగరంలోని బైపాస్ రోడ్డు పరిధిలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.జక్రాన్ పల్లి మండలం లోని బాలానగర్ గ్రామానికి చెందిన నర్రా గంగమని(35).
కూలీ పనులు చేసుకుంటారు. మేస్త్రి పనులు నిమిత్తం ఈ నెల 27న నిజమాబాద్ వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళే క్రమంలో బైపాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న బస్సును ఎక్కే ప్రయత్నం లోకాలు జారీ కింద పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.