HomeCRIMEమత్తుపై ఎక్సైజ్‌ ఉక్కుపాదం.. గంజాయి, కల్లు, గుడుంబాపై విస్తృత దాడులు.. నిజామాబాద్‌ పరిధిలో 18 గంజాయి...

మత్తుపై ఎక్సైజ్‌ ఉక్కుపాదం.. గంజాయి, కల్లు, గుడుంబాపై విస్తృత దాడులు.. నిజామాబాద్‌ పరిధిలో 18 గంజాయి కేసులు.. 30 కిలోలకు పైగా స్వాధీనం..

కల్తీ కల్లు, అక్రమ రవాణాపైనా ప్రత్యేక నిఘామత్తు పదార్థాల అక్రమ మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు నిజామాబాద్‌ ఎక్సైజ్‌ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు జిల్లా ప్రోహిబీషన్ ఎక్సైజ్ శాఖా నిజామాబాద్‌ పరిధిలోని వివిధ ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్లలో కల్లు, గుడుంబా, గంజాయి తదితరాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేసినట్లు డీపిఈఓ అరుణ్‌కుమార్‌ తెలిపారు. నిజామాబాద్‌ పరిధిలో..నిజామాబాద్‌ ఎస్హెచ్ఓ పరిధిలో 22 కల్లు నమూనాలు సేకరించి, 22 మందిని అరెస్టు చేశారు. అక్రమ కల్లు రవాణాకు సంబంధించి 34 కేసులు నమోదు చేసి 29 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 2,014 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే పారబోశారు. నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. గంజాయికి సంబంధించి 12 కేసులు నమోదు చేసి 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 21 మందిని అరెస్టు చేయడంతోపాటు నాలుగు వాహనాలు, 14 మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేశారు.ఆర్మూర్‌లోనూ దాడులు..ఆర్మూర్‌ ఎస్హెచ్ఓ పరిధిలో 14 కల్లు కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. 1,461 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. 33 కల్లు నమూనాలను సేకరించారు. మూడు ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని మూడు వాహనాలను సీజ్‌ చేశారు.బోధన్‌లో 26 కల్లు కేసులుబోధన్‌ ఎస్హెచ్ఓ పరిధిలో 89 కల్లు నమూనాలను సేకరించారు. కల్లు అక్రమాలకు సంబంధించి 26 కేసులు నమోదు చేసి 19 మందిని అరెస్టు చేశారు. 1,089 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్నారు.భీమ్‌గల్‌లో గుడుంబాపై ఉక్కుపాదంభీమ్‌గల్‌ ఎస్హెచ్ఓ పరిధిలో 139 గుడుంబా కేసులు నమోదు చేశారు. 288 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన 4,785 లీటర్ల పులియబెట్టిన బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. మూడు గంజాయి కేసుల్లో 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు కల్లు కేసులు నమోదు కాగా, మొత్తం 94 మందిని అరెస్టు చేశారు.మోర్తాడ్‌లో 16 నమూనాలుమోర్తాడ్‌ ఎస్హెచ్ఓ పరిధిలో 16 కల్లు నమూనాలను సేకరించారు. *మత్తు పదార్థాలపై నిరంతర నిఘా* కల్లులో మత్తు పదార్థాలు కలిపే అక్రమ రవాణాను అరికట్టేందుకు రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. గతంలో గంజాయి విక్రయించిన వారిపై నిరంతర నిఘా ఉంచడంతోపాటు గంజాయి రవాణా, విక్రయాలను అడ్డుకునేందుకు పాత నేరస్థుల కదలికలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. గంజాయి వినియోగదారులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. విద్యార్థులకు అవగాహనవ్యసనాలకు దూరంగా ఉండేలా విద్యార్థులకు కౌన్సెలింగ్‌, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డీపిఈఓ అరుణ్‌కుమార్‌ తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులోనూ తనిఖీలు, నిఘాను మరింత ముమ్మరం చేస్తామని వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments