HomeCRIMEరైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం డిచ్‌పల్లి రైల్వే గేట్‌ వద్ద చోటుచేసుకుంది. డిచ్‌పల్లి ప్రాంతానికి చెందిన ముల్లా సురేష్‌ కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం.

శనివారం డిచ్‌పల్లి గేట్‌ వద్ద రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ సాయిరెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments