ఎరువుల బస్తా పైన పడి రైతు మృతి చెందిన ఘటన ఎడపల్లి లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే మండల కేంద్రానికి చెందిన పల్లికొండ రమేష్(32) వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం ఎరువులు చల్లేందుకు పొలం వద్దకు వెళ్లి తిరిగి రాలేదు.
కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్విచ్ఎఫ్ వచ్చింది. రమేష్ తానుమోసుకెళ్తున్న ఎరువుల బస్తాతో ఒడ్డుపైనుంచి జారి పడడంతో ఎరువుల బస్తా మీద పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
