HomeTelanganaNizamabadయూరియా వాడకంపై రైతులకు అవగాహన

యూరియా వాడకంపై రైతులకు అవగాహన

రైతులకి యూరియా వాడకం పైన వేల్పూర్ మండలంలోని పడగల్ సొసైటీ వద్ద వ్యవసాయ శాఖ అధికారి శృతి, AEO సాయిరాం అవగాహన కల్పించారు.వేల్పూర్ మండలంలో వరి మరియు మొక్కజొన్న ప్రధాన పంటలుగా ఉన్నాయి.

గతేడాది వానకాలం సీజన్ మొత్తానికి 2200MT యూరియా విక్రయాలు జరగగా ఈసారి సీజన్ ప్రారంభం అయ్యి కేవలం ఒక్క నెలలోనే 1400MT యూరియా విక్రయాలు జరిగాయి .

దీంతో ప్రస్తుతం మొక్కజొన్న పంటకి మొదటి దఫా కొరకు మాత్రమే యూరియా అవసరం ఉంటుంది కానీ రైతులు సీజన్ మొత్తానికి సరిపడా ఎరువులను ఒకేసారి కొనుగోలు చేయడం వలన యూరియా కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉంటుందని రైతులకు వివరించారు.

యూరియా సరఫరా పంట దశని బట్టి విడతల వారీగా ఉంటుందని, . ఒకే నెలలో సీజన్ మొత్తానికి సరిపడా యూరియాను అందించలేమని వివరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments