గత వారం రోజులుగా జిల్లాల్లో కురిసిన గాలివానకు మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షానికి తోడు గాలి రావడంతో చేతికి వచ్చిన మొక్కజొన్న పంట నేలకొరిగింది.
దీంతో రైతులు నిండా మునిగిన పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ మండలం.
పాలెం గ్రామంలో కురిసిన గాలివానకు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట చేతికొచ్చిన సమయంలో నేలపాలైందని ఏలేటి చిన్న రాజన్న అనే రైతు లబోదిబోమంటున్నాడు.
ఈ ప్రాంతంలో అత్యధిక రైతులు ఎక్కువ మొత్తం విస్తీర్ణంలో మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. గాలి వాన వల్ల నష్టం జరిగిందని రైతులు వాపోయారు.
చాలామంది రైతుల మొక్క జొన్న పంట చేతికి వచ్చే సమయంలో నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కొక్క రైతుకు ఎకరానికి 50 వేల వరకు నష్టం జరిగిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు.