HomeTelanganaNizamabadకాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్ ఫై విచారణ ....బిఆర్ యస్ శ్రేణుల్లో ఉత్కంఠ .....అక్క వచ్చేస్తుందంటూ...

కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్ ఫై విచారణ ….బిఆర్ యస్ శ్రేణుల్లో ఉత్కంఠ …..అక్క వచ్చేస్తుందంటూ అనుయాయుల హంగామా ….ఢిల్లీ కి వెళ్లిన నేతలు

ఢిల్లీ లిక్కర్ కేసులో లో అరెస్టయి జైలు లో ఉన్న ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది.ఇదే కేసులో అరెస్టు అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కు ఇదే ధర్మాసనం బెయిల్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కు బెయిల్ రావడం ఖాయమని గులాబీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కవిత కు బెయిల్ రావడం పక్క అంటూ బిఆర్ యస్ వాట్సప్ గ్రూప్ ల్లో మెసేజ్ లు చక్కర్లు కొడుతున్నాయి.

సంబరాలకు సిద్ధంగా ఉండాలంటూ సంకేతాలు ఇస్తున్నారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి మొదటి విచారణ జరిగే రోజు అక్కడే ఉన్నారు.

మంగళవార బెయిల్ కచ్చితంగా వస్తుందని స్వయంగా కేటీఆర్ చెప్తున్నా నేపథ్యంలో కొందరు జిల్లా నేతలు రెండు రోజుల ముందే ఢిల్లీ వెళ్లారని సమాచారం.

లిక్కర్ స్కామ్లో ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు(ట్రయల్), ఢిల్లీ హైకోర్టు కొట్టేసాయి .

దీంతో ఈ కేసుల్లో మధ్యంతర బెయిల్ కోరుతూ ఈ నెల 7న ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

గతంలో రెండుసార్లు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

దీనితో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు , కవిత బెయిల్ పిటిషన్  మంగళవారం సుప్రీం కోర్టు ముందుకు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావు సోమవారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. కవిత తరఫు అడ్వకేట్లతో వారు భేటీ అయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments